సోలో లైఫే సో బెటర్!
ABN , First Publish Date - 2020-11-18T10:18:03+05:30 IST
అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రరంగంలో అగ్రతారగా త్రిష కొనసాగుతున్నారు. ఆమెకంటే జూనియర్ కథానాయికలు పెళ్లిళ్లు...

అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రరంగంలో అగ్రతారగా త్రిష కొనసాగుతున్నారు. ఆమెకంటే జూనియర్ కథానాయికలు పెళ్లిళ్లు చేసుకొంటున్నారు. పిల్లల్ని కంటున్నారు. ఇంకొందరు డేటింగ్‌లో ఉన్నారు. కానీ త్రిష మాత్రం ఇప్పటి వరకు సింగిలే. ‘త్రిష పెళ్లి ఎప్పుడు?’ అనే అభిమానుల సందేహానికి ఎట్టకేలకు సమాధానమిచ్చారామె. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నన్ను పూర్తిగా అర్థం చేసుకోగల వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘ఒక వేళ నేను కోరుకున్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తారసపడకపోతే జీవితాంతం ఒంటరిగా ఉండడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని స్పష్టం చేశారు. ఒక తెలుగు నటుడుతో ప్రేమలో ఉన్నట్లు త్రిష గతంలో చెప్పారు. కానీ ఏవో కారణాల వల్ల ఆ బంధం అట్టే కొనసాగలేదు. 2015లో వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత త్రిష కెరీర్ బిజీలో పడిపోయారు. ప్రస్తుతం తమిళంలో ‘రాంగీ’, ‘సుగర్’ చిత్రాలను అంగీకరించారు. తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటించేందుకు అంగీకరించినా తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తప్పుకున్నట్టు వెల్లడించారు.