వాలెంటైన్స్ డే కానుకగా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియో

ABN , First Publish Date - 2020-02-02T01:09:12+05:30 IST

‘ప్రతిరోజూ పండుగే’ చిత్రంతో మంచి హిట్ కొట్టిన సుప్రీం హీరో సాయి తేజ్.. అదే జోష్‌లో మరో చిత్రంలో నటించాడు. ఈ సారి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ

వాలెంటైన్స్ డే కానుకగా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియో

‘ప్రతిరోజూ పండుగే’ చిత్రంతో మంచి హిట్ కొట్టిన సుప్రీం హీరో సాయి తేజ్.. అదే జోష్‌లో మరో చిత్రంలో నటించాడు. ఈ సారి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ప్రతిరోజూ పండుగే’ చిత్రానికి పూర్తి విరుద్ధంగా ఈ చిత్రం ఉండబోతోందని టైటిల్‌ని బట్టి చూస్తే అర్థమవుతోంది.


ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ వీడియోను వాలెంటైన్స్ డే వీకెండ్‌లో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా సాయి తేజ్‌కి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చేతిలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే పుస్తకం పట్టుకుని ప్రజలకు సాయి తేజ్ అభివాదం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్‌ను రూపొందించారు. ఈ చిత్రం సాయి తేజ్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

Updated Date - 2020-02-02T01:09:12+05:30 IST