సోలో బ్రతుకే సో బెటర్.. థియేటర్స్‌లోనే
ABN , First Publish Date - 2020-11-14T01:10:28+05:30 IST
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకుడిగా పరిచయం

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ పోరి నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటికే అనేకానేక వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందంటూ వార్తలు బాగా వినిపించాయి. థియేటర్స్ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా.. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేందుకు ఇంకా సిద్ధం కాకపోవడంతో.. విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాయి.
సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ అవుతాయని భావించిన కొందరు హీరోలు.. సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇక సాయితేజ్ కూడా తన సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్' థియేటర్‌లోనే విడుదల అని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే సంక్రాంతి కంటే ముందే అంటే డిసెంబర్‌లోనే.. మీకు నాకు ఇష్టమైన థియేటర్లో కలుద్దాం. దీపావళి శుభాకాంక్షలు అని తెలుపుతూ.. చిత్ర పోస్టర్‌ని సాయితేజ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సో.. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల విషయంలో ఉన్న డౌట్స్‌పై ఓ క్లారిటీ వచ్చేసినట్లే.