అదరగొట్టిన `సోలో బ్రతుకే..`!

ABN , First Publish Date - 2020-12-26T17:27:22+05:30 IST

చాలా కాలంగా మూతబడిన థియేటర్ల వద్ద మళ్లీ సందడి మొదలైంది

అదరగొట్టిన `సోలో బ్రతుకే..`!

చాలా కాలంగా మూతబడిన థియేటర్ల వద్ద మళ్లీ సందడి మొదలైంది. కరోనా కష్టకాలంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. శుక్రవారం విడుదలైన సాయితేజ్ `సోలో బ్రతుకే సో బెటర్` సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు కాస్త భరోసానందించింది. మెగా హీరో సాయితేజ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు సుబ్బు రూపొందించిన చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. 


క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి రోజు మంచి కలెక్షన్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమా తొలి రోజు రూ. 4.70 కోట్లు (గ్రాస్) సాధించినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ ఈ స్థాయి కలెక్షన్లు రావడం టాలీవుడ్‌లో సంతోషాన్ని నింపుతోంది. 


Updated Date - 2020-12-26T17:27:22+05:30 IST