హీరోగా సొహైల్.. తొలి సినిమా ఫిక్స్!

ABN , First Publish Date - 2020-12-24T17:49:09+05:30 IST

`బిగ్‌బాస్-4` కార్యక్రమంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సోహైల్.

హీరోగా సొహైల్.. తొలి సినిమా ఫిక్స్!

`బిగ్‌బాస్-4` కార్యక్రమంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సొహైల్. మూడో స్థానంలో నిలిచినా విన్నర్‌ను మించిన క్రేజ్ దక్కించుకున్నాడు. త్వరలో వెండితెర మీద కూడా మెరవబోతున్నాడు. హీరోగా సొహైల్ తొలి సినిమాకు రంగం సిద్ధమైంది. 


`జార్జి రెడ్డి`, `ప్రెషర్‌ కుక్కర్‌` సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

Updated Date - 2020-12-24T17:49:09+05:30 IST