బిగ్‌బాస్‌: రూ. 25 లక్షలతో వెనుదిరిగిన సొహైల్‌

ABN , First Publish Date - 2020-12-21T02:33:19+05:30 IST

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ సీజన్‌ 4 కంప్లీట్‌ చేసుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్‌' ఫైనల్‌ ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది స్టార్‌ మా. టాప్‌ 3 కంటెస్టెంట్స్‌గా

బిగ్‌బాస్‌: రూ. 25 లక్షలతో వెనుదిరిగిన సొహైల్‌

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ సీజన్‌ 4 కంప్లీట్‌ చేసుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్‌' ఫైనల్‌ ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది స్టార్‌ మా. ఇక ఈ ఫైనల్ షో లో టాప్‌ 3 కంటెస్టెంట్స్‌గా అభిజిత్‌, అఖిల్‌, సొహైల్‌ మిగిలారు. అయితే టాప్‌ 3లో ఉన్న ఈ ముగ్గురి నుంచి సొహైల్‌ 3వ స్థానం చాలని చెబుతూ.. బిగ్‌బాస్‌ ఆఫర్‌ చేసిన రూ. 25 లక్షలతో బయటికి వచ్చేశాడు.


బిగ్‌బాస్‌ ఓ బ్రీఫ్‌కేసు పంపించగా.. ముగ్గురు కంటెస్టెంట్స్‌ని దానిని పట్టుకోమని.. అందులో రూ. 20 లక్షలు ఉన్నట్లుగా హోస్ట్ కింగ్‌ నాగ్‌ తెలిపారు. ఎవరైతే ఆ రూ. 20 లక్షలు చాలని అనుకుంటారో.. నిరభ్యంతరంగా షో నుంచి అది తీసుకుని బయటికి వచ్చేయవచ్చని తెలిపారు. తర్వాత మరో రూ. 5 లక్షలు పెంచారు. దీంతో వెంటనే సొహైల్‌ నేను తీసుకుంటానని తెలిపారు. సొహైల్‌ తీసుకున్న నిర్ణయంపై వారి పేరేంట్స్‌ ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయాన్ని కూడా సొహైల్‌కి చూపించారు. దీంతో సొహైల్‌ సంతోషంగా ఆ రూ. 25 లక్షల బ్రీఫ్‌కేస్‌ తీసుకుని షో బయటికి వచ్చేశారు. దీంతో ఈ సీజన్‌లో సొహైల్‌ టాప్‌ 3 ప్లేస్‌కి పరిమితమయ్యారు. సొహైల్‌ తీసుకున్న రూ. 25 లక్షలలో.. రూ. 10 లక్షల రూపాయలను అనాథలకు ఇస్తానని ప్రామిస్‌ చేశారు.

Updated Date - 2020-12-21T02:33:19+05:30 IST