సమాజం షురూ!
ABN , First Publish Date - 2020-10-25T06:52:43+05:30 IST
మణికాంత్ కథానాయకుడిగా ‘సమాజం’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఎమ్.రవి నాయక్ దర్శకత్వంలో కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై...

మణికాంత్ కథానాయకుడిగా ‘సమాజం’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఎమ్.రవి నాయక్ దర్శకత్వంలో కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై నర్సింహ గౌడ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినూత్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. నవంబర్ మూడో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అని అన్నారు.