సోషల్‌ థ్రిల్లర్‌!

ABN , First Publish Date - 2020-10-05T07:52:51+05:30 IST

ప్రతిభావంతులైన తెలుగు నటుల్లో సుబ్బరాజు ఒకరు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, కీలక పాత్రధారిగా పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు...

సోషల్‌ థ్రిల్లర్‌!

ప్రతిభావంతులైన తెలుగు నటుల్లో సుబ్బరాజు ఒకరు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, కీలక పాత్రధారిగా పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. త్వరలో ఆయన ఓ ఓటీటీ వేదిక కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఒరిజినల్‌ వెబ్‌ ఫిల్మ్‌లో నటించనున్నారు. దీనికి ‘అసాధ్యుడు’, ‘మిస్టర్‌ నూకయ్య’, ‘రన్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్‌కృష్ణ కన్నెగంటి దర్శకుడు. సోషల్‌ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించనున్నారని తెలిసింది. సమాజంలో జరుగుతున్న అంశాలను ప్రస్తావిస్తూనే, అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే విధంగా స్ర్కిప్ట్‌ను సిద్ధం చేశారట. త్వరలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సంగీత దర్శకుడు-గాయకుడు, ‘పలాస’ చిత్రంతో నటుడిగా మారిన రఘు కుంచె మరో కీలక పాత్రలో నటించనున్నట్టు తెలిసింది.

Updated Date - 2020-10-05T07:52:51+05:30 IST

Read more