అలాంటి వారికి ఎలాంటి బౌండరీలు లేవు: వర్మ

ABN , First Publish Date - 2020-06-28T00:33:24+05:30 IST

రామ్ గోపాల్ వర్మ.. పరిచయం అక్కరలేని పేరు. సంచలనానికి మారు పేరు. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీనే. అందుకే అంటారు వర్మ అంటే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అని. ఎప్పుడూ

అలాంటి వారికి ఎలాంటి బౌండరీలు లేవు: వర్మ

రామ్ గోపాల్ వర్మ.. పరిచయం అక్కరలేని పేరు. సంచలనానికి మారు పేరు. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీనే. అందుకే అంటారు వర్మ అంటే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అని. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీని కోరుకునే వర్మ.. తాజాగా ఓ యాంకర్‌తో మాట్లాడుతూ కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఆ యాంకర్ కూడా ఆయన చెప్పినట్లే ఉందనుకోండి. తాజాగా ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న ఓ యాంకర్ ‘‘సార్.. రీసెంట్ టైమ్స్‌లో ఏ అమ్మాయిని చూస్తే.. వావ్ అనిపించింది..’’ అని అడిగింది. దీనికి వర్మ ‘‘చాలా మంది అలా అనిపించారు. ఇన్‌క్లూడింగ్ యు..’’ అని ఆ యాంకర్‌ని వర్మ చూపించారు. అంతే ఆ యాంకర్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి మరి.


ఇక ఈ ఇంటర్వ్యూలో జరిగిన ఈ సీన్‌ని హైలెట్ చేస్తూ కొందరు నెటిజన్లు టిక్‌టాక్ వీడియో చేశారు. ఈ వీడియోలో వర్మ ‘నీతో కలిపి’ అనే పదం చెప్పగానే ‘అయిపాయే..’ అని వాయిస్‌తో పాటు ‘ఖుషి’ సినిమాలోని మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. ఆ తర్వాత కేరింత సినిమాలో పార్వతీశం చెప్పే ‘ఫైవ్‌ మినిట్స్‌ చాట్‌.. గుంట ఫ్లాట్’‌ అనే డైలాగ్.. ఇది టిక్‌టాక్ వీడియో. ఈ వీడియోని షేర్ చేసిన వర్మ.. ‘‘క్రియేటివ్‌‌గా ఆలోచించే అబ్బాయిలకు ఎలాంటి బౌండరీలు లేవు. ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయిని, నన్ను ఎలా చిత్రీకరించారో.. ఈ వీడియోలో చూడండి..’’ అని పోస్ట్ చేశారు. Updated Date - 2020-06-28T00:33:24+05:30 IST