అత్త అయినా, కోడలు అయినా ఇంట్లో ఉండాల్సిందే : స్మృతి

ABN , First Publish Date - 2020-04-16T12:07:11+05:30 IST

ఏక్తా కపూర్ సీరియల్ క్యోమ్ కి సాస్ భీ కబీ బాహు థితో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటి, బిజెపి మంత్రి స్మృతి ఇరానీ కరోనా వైరస్ పై ప్రజలకు...

అత్త అయినా, కోడలు అయినా ఇంట్లో ఉండాల్సిందే : స్మృతి

ఏక్తా కపూర్ సీరియల్ క్యోమ్ కి  సాస్ భీ కబీ బాహు థితో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటి, బిజెపి మంత్రి స్మృతి ఇరానీ కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షోలో తులసి పాత్రలో నటించిన స్మృతి తాజాగా తన షో కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ సీరియల్ పరిచయ పాటలో తులసి తలుపులు తెరిచి, ఆమె ఇంట్లో ఉన్న వారిని పరిచయం చేస్తుంది. అయితే, స్మృతి షేర్ చేసిన వీడియోలో ఆమె తలుపులు మూసివేస్తుంది. ఈ వీడియో ద్వారా స్మృతి అందరినీ  ఇంట్లో ఉండమని సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఇంట్లో ఉండి, మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచండి. అత్త అయినా, కోడలు అయినా ఇంట్లో ఉండాల్సిందే అనే కామెంట్ వీడియో కింద రాశారు. 

Updated Date - 2020-04-16T12:07:11+05:30 IST

Read more