సీపీ స‌హ‌కారంతో 82,360 మందికి స్మిత అన్న‌దానం

ABN , First Publish Date - 2020-04-28T23:46:30+05:30 IST

పాపుల‌ర్ తెలుగు పాప్ సింగ‌ర్ స్మిత ప్ర‌స్తుత సంక్షోభ కాలంలో నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నారు. సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్

సీపీ స‌హ‌కారంతో 82,360 మందికి స్మిత అన్న‌దానం

పాపుల‌ర్ తెలుగు పాప్ సింగ‌ర్ స్మిత ప్ర‌స్తుత సంక్షోభ కాలంలో నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నారు. సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి. స‌జ్జ‌నార్ బృందం స‌హ‌కారంతో ఆమె ఇప్ప‌టివ‌ర‌కూ 82,360 మందికి అన్న‌దానం చేశారు. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్ల‌డి చేశారు. 


‘‘స‌జ్జ‌నార్ స‌ర్‌.. మిమ్మ‌ల్ని క‌లుసుకోవ‌డం, గ‌త 30 రోజులుగా మీ బృందంతో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. మీ టీమ్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ 82,360 మందికి భోజ‌నం పెట్టాం. ఇప్పుడు మీ సూచ‌న మేర‌కు నిత్యావ‌స‌రాల‌ను అందించే ప‌ని ప్రారంభిస్తున్నాం. ఈ సంక్షోభ కాలంలో నాకు సాధ్య‌మైనంత‌లో సాయం చేస్తాన‌ని ప్రామిస్ చేస్తున్నాను’’ అని స్మిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఆమె ‘టీమ్ అలై’, ‘టీమ్ బ‌బుల్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ల‌ను జోడించారు.Updated Date - 2020-04-28T23:46:30+05:30 IST