'గమనం' నుండి మరో ఆసక్తిరమైన అప్‌డేట్
ABN , First Publish Date - 2020-10-05T20:30:32+05:30 IST
రియల్ లైఫ్ డ్రామాతో దర్శకుడు సుజనారావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ 'గమనం'.

రియల్ లైఫ్ డ్రామాతో దర్శకుడు సుజనారావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ 'గమనం'. ఈ సినిమా నుండి ఇప్పటికే శైలపుత్రీదేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నిత్యామీనన్ లుక్తో పాటు శ్రియాశరన్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సోమవారం రోజున ఈ చిత్రంలో నటించే మరో రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ముస్లిం యువతి జరాగా ప్రియాంక జవాల్కర్‌తో పాటు ముస్లిం యువకుడు అలీగా నటిస్తోన్న శివ కందుకూరి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. సినిమాటోగ్రాఫర్ జ్ఞ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాతగా మారి రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపుతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
Read more