మూడు భాషల్లో సీతాయణం

ABN , First Publish Date - 2020-12-22T06:20:25+05:30 IST

కన్నడ కథానాయకుడు శశికుమార్‌ తనయుడు అక్షిత్‌ శశికుమార్‌ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సీతాయణం’. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో...

మూడు భాషల్లో సీతాయణం

కన్నడ కథానాయకుడు శశికుమార్‌ తనయుడు అక్షిత్‌ శశికుమార్‌ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సీతాయణం’. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో విడుదలవుతోన్న ఈ చిత్రంలోని పెళ్లిపాటను సోమవారం హైదరాబాద్‌, ప్రసాద్‌ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రభాకర్‌ ఆరిపాక మాట్లాడుతూ‘‘ సమకాలీన పరిస్థితుల్లో ఓ అమ్మాయి జీవిత ప్రయాణానికి సంబంధించిన కథే సీతాయణం’’ అన్నారు. ‘‘తెలుగులో తొలిచిత్రం చేస్తున్న నన్ను ఆదరించమని ప్రేక్షకులను కోరుతున్నాను. భాష సమస్యగా ఉన్నా దర్శకుడు నాతో మంచి అవుట్‌పుట్‌ రాబట్టారు’’ అని హీరో అక్షిత్‌ శశికుమార్‌ చెప్పారు. అనహిత భూషణ్‌ కథానాయిక. లలితా రాజ్యలక్ష్మి నిర్మాత. 

Updated Date - 2020-12-22T06:20:25+05:30 IST