మహేష్‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

ABN , First Publish Date - 2020-10-18T03:33:49+05:30 IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటో చూస్తే.. నవరాత్రి పండగ అంతా సితార దగ్గరే ఉందా అని

మహేష్‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటో చూస్తే.. నవరాత్రి పండగ అంతా సితార దగ్గరే ఉందా అని అనిపించకమానదు. రెండు జడలతో, పట్టు పరికిణీలో అచ్చతెలుగు ఆడపిల్లలా.. ఎంతో ముద్దుగా ఉంది సితార. సోషల్‌ మీడియాని ఎంతో చాకచక్యంగా వాడుతున్న సితార.. తను పోస్ట్ చేసే పోస్ట్‌లతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. 


తాజాగా ఆమె తనకు ఈ డ్రస్‌ ఎంతగానో నచ్చిందని తెలుపుతూ.. తనకు ఈ డ్రస్‌ ఏర్పాటు చేసిన డిజైనర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇక ఈ ఫొటోని చూసిన సితార తల్లి నమ్రతా శిరోద్కర్‌ ఆనందానికి అవధుల్లేవంటే నమ్మండి. ఒక్క నమ్రతానే కాదు.. ఈ పిక్‌లో సితారను చూసిన ఎవ్వరైనా ముగ్ధులవ్వాల్సిందే. అంత క్యూట్‌గా ఉంది సితార.  Updated Date - 2020-10-18T03:33:49+05:30 IST