నాన్నా.. తప్పించుకోలేవు: ఫన్నీ వీడియో షేర్ చేసిన సితార

ABN , First Publish Date - 2020-12-01T16:36:53+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ కుటుంబంలో అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

నాన్నా.. తప్పించుకోలేవు: ఫన్నీ వీడియో షేర్ చేసిన సితార

సూపర్ స్టార్ మహేష్ కుటుంబంలో అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మహేష్, నమ్రతతోపాటు వారి పిల్లలు గౌతమ్, సితార కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా సితార తండ్రితో ఉన్న ఫొటోలను, వీడియోలను తరచుగా పోస్ట్ చేస్తుంటుంది. 


తాజాగా సితార పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెమెరాకు చిక్కకుండా మహేష్ తప్పించుకుంటున్న వీడియోను సితార షేర్ చేసింది. `నాన్నా.. నా కెమేరా నుంచి నువ్వు తప్పించుకోలేవు` అని కామెంట్ చేసింది. ఇటీవలె ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లొచ్చిన మహేష్.. వచ్చే ఏడాది జనవరిలో `సర్కారు వారి పాట` షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాడు.Updated Date - 2020-12-01T16:36:53+05:30 IST

Read more