`సరిలేరు నీకెవ్వరు`లో తమన్నా సాంగ్‌కు సితార డాన్స్

ABN , First Publish Date - 2020-02-14T21:27:08+05:30 IST

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్ని సాధించింది. మ‌హేశ్ హీరోగా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

`సరిలేరు నీకెవ్వరు`లో తమన్నా సాంగ్‌కు సితార డాన్స్

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్ని సాధించింది. మ‌హేశ్ హీరోగా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ పాట‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కాయి. అలాగే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. `డాంగ్ డాంగ్‌...` అంటూ సాగే ఈ పాట‌ల‌ను మహేశ్, త‌మ‌న్నా డాన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. ఇప్పుడు అదే పాట‌కు మ‌హేశ్ కుమార్తె సితార డాన్స్ చేసింది. ఈ వీడియోను మ‌హేశ్ స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సితార డాన్స్ చూసిన నెటిజ‌న్స్‌..సితార డాన్స్‌తో త‌మ‌న్నాను బీట్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంత‌కు ముందు `ప‌ద్మావ‌త్` చిత్రంతో పాటు `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలోనే హీ ఈజ్ సో క్యూట్ పాట‌కు కూడా డాన్స్ చేసింది సితార‌.  


వీడియో కోసం క్లిక్ చేయండి.. 

Updated Date - 2020-02-14T21:27:08+05:30 IST