ఆకట్టుకుంటోన్న ‘భద్రకాళి’ ట్రైలర్

ABN , First Publish Date - 2020-11-17T00:30:46+05:30 IST

సీనియర్ నటి ‘భద్రకాళి‘ అమ్మవారిగా నటిస్తోన్న చిత్రం ‘భద్రకాళి’. బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. కె.ఎమ్. ఆనంద్

ఆకట్టుకుంటోన్న ‘భద్రకాళి’ ట్రైలర్

సీనియర్ నటి సీత ‘భద్రకాళి‘ అమ్మవారిగా నటిస్తోన్న చిత్రం ‘భద్రకాళి’. బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. కె.ఎమ్. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిక్కవరపు రాంబాబు నిర్మించారు. దీపావళి కానుకగా ఈ చిత్ర ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.


ఈ సందర్భంగా నటి సీత మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేను భద్రకాళిగా నటిస్తున్నాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు దేవత పాత్రలు ఎన్నో వేశాను కానీ రౌద్రం కూడిన భద్రకాళిగా వేయడం ఇదే తొలిసారి. ఈ మధ్య భక్తిరస ప్రధాన చిత్రాలు రావడం లేదు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మా చిత్రంలో ప్రేక్షకులని అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.. ’’ అని తెలిపారు.


“అన్నమయ్య, అమ్మోరు, దేవుళ్ళు చిత్రాల స్థాయిలో ఈ చిత్రం వచ్చింది. ఈ జోనర్‌లో వున్న సినిమాలకు సంగీతం ముఖ్యం. పాటలు ఎవర్ గ్రీన్‌గా ఉండాలి.. అందుకోసం ఇందులో ఏడు పాటలు కూడా అదేస్థాయిలో రికార్డింగ్ చేశాము.. వీగా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల చేశాము. దీపావళి కానుకగా విడుదల చేసిన ట్రైలర్‌కు అమ్మవారి ఆశీస్సులతో మంచి స్పందన వస్తోంది” అని నిర్మాత చిక్కవరపు రాంబాబు తెలుపగా.. “భద్రకాళి అమ్మవారికి ఓ భక్తుడికి మధ్య జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథ ఉంటుంది. సీతగారు అమ్మవారి పాత్రలో ఒదిగిపోయారు. చిత్రంలోని సహజమైన విజువల్ ఎఫెక్ట్ కోసం గ్రాఫిక్స్ చేయడం జరిగింది. భక్తిరస ప్రధాన చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ గ్యాప్‌ను మా చిత్రం పూరిస్తుందని ఆశిస్తున్నాము..’’ అన్నారు దర్శకుడు కె.ఎమ్. ఆనంద్.Updated Date - 2020-11-17T00:30:46+05:30 IST