సుశాంత్ మ‌ర‌ణాన్ని తట్టుకోలేక వ‌దిన మృతి!

ABN , First Publish Date - 2020-06-16T11:25:04+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిని త‌ట్టుకోలేక‌ అత‌ని వ‌దిన ప్రాణాలొదిలారు. ముంబైలో సుశాంత్ దహన సంస్కారాలు జ‌రుగుతుండ‌గా...

సుశాంత్ మ‌ర‌ణాన్ని తట్టుకోలేక వ‌దిన మృతి!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిని త‌ట్టుకోలేక‌ అత‌ని వ‌దిన ప్రాణాలొదిలారు. ముంబైలో సుశాంత్ దహన సంస్కారాలు జ‌రుగుతుండ‌గా, బీహార్‌లో అతని సోదరుని భార్య కన్నుమూశారు. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని తెలియ‌గానే అత‌ని వ‌దిన తీవ్రంగా క‌ల‌తచెంది తిన‌డం మానేశారు. సుశాంత్ వ‌రుస సోద‌రుని భార్య సుధా దెని బీహార్‌లోని పూర్ణియాలో ఉంటున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న‌డ‌న్న వార్త విన‌గానే ఆమె నీటిని కూడా ముట్ట‌డం మానేశారు. సుశాంత్ మరణంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబైలో సుశాంత్‌కు తుది వీడ్కోలు ప‌లుకుతున్న‌ సమయంలో పూర్ణియాలో సుధ ఊపిరివ‌దిలారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విలేపార్లేలోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దహన సంస్కారాలు నిర్వ‌హించారు. 

Updated Date - 2020-06-16T11:25:04+05:30 IST