‘ఎల్లిపోతావురా మనిషి’ అంటూ స్వాతి రెడ్డి పాట.. తెలుగువారికి అంకితం
ABN, First Publish Date - 2020-07-25T01:19:16+05:30
సప్త సముద్రాలూ దాటి పర దేశ సంప్రదాయాలతో బ్రతుకుతున్నా.. మన భారత దేశ సంప్రదాయాలు ఎప్పటికి మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ప్రతిరోజూ ఆంగ్లంలో మాట్లాడుతున్న
సప్త సముద్రాలూ దాటి పర దేశ సంప్రదాయాలతో బ్రతుకుతున్నా.. మన భారత దేశ సంప్రదాయాలు ఎప్పటికి మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ప్రతిరోజూ ఆంగ్లంలో మాట్లాడుతున్న మన తెలుగు భాషను ఎన్నడూ మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ఎన్నో అద్భుతమైన తెలుగు బాణీలతో స్పష్టమైన తెలుగు మాటలతో మన తెలుగువాళ్లని ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ‘ఎల్లిపోతావురా మనిషి’ అంటూ మరో పాటతో వచ్చింది. ఈ పాటని ఆమె తెలుగువారికి అంకితం ఇవ్వడం విశేషం.
‘‘ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓ నాడు ఈ భూమి వదిలేసి..... ఉండాలి రా కలిసిమెలిసి అర్రే ఉన్నన్నాళ్లు కొత్త తెలిసి’’ అంటూ మనసుకు హత్తుకునే లిరిక్స్‌తో ఆమె పాడిన ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మన భారతమాత తన బిడ్దలను కాచి కాపాడుతుంది. అలానే మనిషి పుట్టుక పుట్టిన మనం కష్టకాలం అయినా కలిసి మెలిసి ఉండాలి అని చెప్పేలా ఈ పాట సాగింది. మానవత్వం మరిచి మనస్సాక్షిని విడిచి స్వార్ధం, ద్వేషంతో బ్రతుకుతున్న మనుషుల గురించి చెబుతూ.. ఈ జీవం కొన్నాళ్లే, ఉన్నన్నాళ్ళు అందరితో కలిసి ఉండమని జీవిత పరమార్థం తెలియజేస్తున్న పాట ఇది. ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో సంగీతం, సాహిత్యం అందించగా లండన్‌లో ఉంటున్న స్వాతి రెడ్డి గానం చేసారు. ఈ పాట చిత్రీకరణ అంతా లండన్‌లోనే జరిగింది. నాగోల్ బాల్ రెడ్డి మరియు లొంక నరేందర్ రెడ్డి ఈ పాటను నిర్మించారు. ఈ పాటని మన తెలుగు వారందరికీ అంకితం ఇస్తున్నట్లుగా వారు తెలియజేశారు.