కరోనా నుంచి నేను కోలుకున్నా: సింగర్ సునీత

ABN , First Publish Date - 2020-08-19T03:43:24+05:30 IST

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా

కరోనా నుంచి నేను కోలుకున్నా: సింగర్ సునీత

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్‌లోని మరో ఇద్దరు సింగర్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ సంగీత కార్యక్రమం కోసం షూటింగ్‌లో పాల్గొన్న వీరికి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సింగర్ సునీత తాజాగా తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియోని విడుదల చేశారు. 


ఆమె మాట్లాడుతూ.. ‘‘నా క్షేమం కోరుతూ.. ఎందరో ఫోన్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు. నిజమే. నేను కోవిడ్ బారిన పడిన మాట వాస్తవమే. ఇటీవల ఓ షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత తలనొప్పి రావడంతో ఎందుకైనా మంచిదని.. టెస్ట్ చేయించాను. అందులో పాజిటివ్ నిర్థారణ అయింది. అప్పటి నుంచి వైద్యుల సూచనలు పాటిస్తూ.. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి కేర్ తీసుకున్నాను. ప్రస్తుతం కోలుకుని, ఆరోగ్యంగా ఉన్నాను. ఈ మహమ్మారితో పోరాటం అంత సులువైనది కాదు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. నాకు చాలా తక్కువ లక్షణాలు ఉండటం వల్ల .. త్వరగా కోలుకున్నాను. నా బాధ అంతా బాలుగారి కోసమే. ఆయన త్వరగా కోలుకుని రావాలని మా ఫ్యామిలీ అంతా ప్రార్థిస్తున్నాము..’’ అని సునీత్ ఈ వీడియోలో పేర్కొన్నారు.Updated Date - 2020-08-19T03:43:24+05:30 IST