సింగర్‌ సునీత ప్రీ వెడ్డింగ్‌ పార్టీ విశేషాలివే

ABN , First Publish Date - 2020-12-21T00:37:49+05:30 IST

సింగర్‌ గానే కాదు.. నిండైన చీరకట్టుతో ఎప్పుడూ అందరినీ అలరించే సునీత.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం

సింగర్‌ సునీత ప్రీ వెడ్డింగ్‌ పార్టీ విశేషాలివే

సింగర్‌ గానే కాదు.. నిండైన చీరకట్టుతో ఎప్పుడూ అందరినీ అలరించే సునీత.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం జరిగింది. 'మ్యాంగో' రామ్‌తో ఆమె జీవితాన్ని షేర్‌ చేసుకోబోతోంది. అయితే డిసెంబర్‌లోనే వీరి వివాహం జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ వివాహం వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. పెళ్లికి చాలా టైమ్‌ ఉండటంతో.. వీరు.. తమ సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు ప్రీ వెడ్డింగ్‌ పార్టీ ఇచ్చినట్లుగా వార్తలే కాదు కొన్ని ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


ఈ పార్టీని సునీతకు కాబోయే భర్త రామ్‌కి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్‌ హోస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్న ఫొటోలను బట్టి.. ఈ పార్టీ గచ్చిబౌలీలోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీలో సునీత, రామ్‌లు కేక్‌ కట్‌ చేసి ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డిసెంబర్ 19 రాత్రి జరిగిన ఈ పార్టీకి టాప్‌ సింగర్స్‌తో పాటు కొందరు సెలబ్రిటీస్‌ కూడా హాజరైనట్లుగా సమాచారం. రేణు దేశాయ్‌, సుమ కనకాల వంటి వారు ఈ పార్టీలో సందడి చేసినట్లుగా వారు షేర్‌ చేసిన ఫొటోలను చూస్తే తెలుస్తోంది.Updated Date - 2020-12-21T00:37:49+05:30 IST