కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సునీత

ABN , First Publish Date - 2020-12-08T07:06:11+05:30 IST

తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలకు గాయని సునీత ఫుల్‌స్టాప్‌ పెట్టారు. త్వరలో వ్యాపారవేత్త రామ్‌తో ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని...

కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సునీత

తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలకు గాయని సునీత ఫుల్‌స్టాప్‌ పెట్టారు. త్వరలో వ్యాపారవేత్త రామ్‌తో ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు సునీత సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. సోమవారం ఉదయం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో రామ్‌-సునీత నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనిపై సునీత స్పందిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రతి తల్లిలాగానే నేనూ నా పిల్లలు చక్కగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో నేనూ జీవితంలో సంతోషంగా ఉండాలని ఆశించే బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు, పిల్లలు నాకు ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. నా జీవితంలో అలాంటి మధుర క్షణం వచ్చే సమయం ఆసన్నమైంది. శ్రద్ధ గల  ేస్నహితుడిగా.. అద్భుతమైన సహచరుడిగా రామ్‌ నా జీవితంలోకి ప్రవేశించారు. మేమిద్దరం అతిత్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచానని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎప్పటిలాగే అందరి సపోర్ట్‌ ఉండాలని ఆశిస్తున్నా’’ అని సునీత పేర్కొన్నారు.


Updated Date - 2020-12-08T07:06:11+05:30 IST