నేను కంగ‌నా అంత ధైర్య‌వంతురాలిని కాను: సిమి గారెవాల్‌

ABN , First Publish Date - 2020-07-19T19:54:36+05:30 IST

ఓ చానెల్‌లో బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా రనౌత్ మాట్లాడుతూ నెపోటిజంపై, తాను ఎదుర్కొన్న ఇబ్బందుల‌పై నిప్పులు చెరిగారు. ఈ ఇంట‌ర్వ్యూ అనంత‌రం సిమి గారెవాల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

నేను కంగ‌నా అంత ధైర్య‌వంతురాలిని కాను:  సిమి గారెవాల్‌

సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం మంట ర‌గులుకుంది. నెపోటిజం ప‌లు ర‌కాలుగా తాము ఎదుర్కొన్న విష‌యాల‌పై అభిప్రాయాల‌ను వెలిబుచ్చారు. ఓ చానెల్‌లో బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా రనౌత్ మాట్లాడుతూ నెపోటిజంపై, తాను ఎదుర్కొన్న ఇబ్బందుల‌పై నిప్పులు చెరిగారు. ఈ ఇంట‌ర్వ్యూ అనంత‌రం సిమి గారెవాల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ‘‘ఇండ‌స్ట్రీలో సుశాంత్ ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌పై నాకు చాలా బాధ‌గా ఉంది. అవుట్ సైడ‌ర్స్ అంద‌రూ ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. కంగనా రనౌత్ నాకంటే ధైర్యవంతురాలు. ఆమెకు నా అభినంద‌న‌లు. ఓ ప‌వ‌ర్ ఉన్న వ్య‌క్తి నా కెరీర్‌ను నాశం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలో నేను నిశ్శ‌బ్దంగా ఉండిపోయాను. ఎందుకంటే నేను ఆమె అంద ధైర్య‌వంతురాలిని కాను’’ అని తెలిపారు సిమి గారెవాల్‌. 

Updated Date - 2020-07-19T19:54:36+05:30 IST