‘వ‌సంత కోకిల’ ఫ‌స్ట్ లుక్ వదిలిన హీరో రానా

ABN , First Publish Date - 2020-11-06T01:46:22+05:30 IST

జాతీయ అవార్డు గ్ర‌హీత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'వ‌సంత కోకిల' చిత్రం ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడదే టైటిల్‌తో

‘వ‌సంత కోకిల’ ఫ‌స్ట్ లుక్ వదిలిన హీరో రానా

జాతీయ అవార్డు గ్ర‌హీత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'వ‌సంత కోకిల' చిత్రం ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడదే టైటిల్‌తో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా హీరోగా మూడు భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. '@న‌ర్త‌న‌శాల' మూవీ ఫేమ్ కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నూతన దర్శకుడు రమణన్‌ పురుషోత్తమ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం రూపొందుతోంది. నవంబర్‌ 6న బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. విశేషం ఏమిటంటే మూడు భాషలలోని స్టార్‌ హీరోలు ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయడం. తెలుగులో రానా దగ్గుబాటి ఈ సినిమా టైటిల్ 'వ‌సంత కోకిల'ని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. అలాగే త‌మిళ్‌లో స్టార్ హీరో ధ‌నుష్, క‌న్న‌డ స్టార్ హీరో ర‌క్షిత్ శెట్టి కూడా ఈ సినిమాకి సంబంధించిన త‌మిళ‌, క‌న్న‌డ టైటిల్స్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ని ఆన్ లైన్‌లో రిలీజ్ చేశారు. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌గా ఈ సినిమా రెడీ అవుతుంది.


ఇక విడుదలైన ఫస్ట్ లుక్‌ విషయానికి వస్తే.. బాబీ సింహా విల‌క్ష‌ణ‌త ప్ర‌తిబింబించేలా.. చేతిలో బౌ అండ్ యారో, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రీన్ క‌ల‌ర్ టింట్ ఇలా ఎన్నో అంశాలను పొందుపరిచారు. సినిమా జాన‌ర్‌కి, బాబీ సింహా అత్యుత్త‌మ నటనకి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా చిత్రయూనిట్‌ తెలుపుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.



Updated Date - 2020-11-06T01:46:22+05:30 IST