భరతనాట్యం నేర్చుకుంటున్న శింబు

ABN , First Publish Date - 2020-11-04T21:58:22+05:30 IST

హీరో శింబు భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ‘వేలాయుధం’ చిత్రంలో నటుడు విజయ్‌కి చెల్లెలుగా నటించిన శరణ్యా మోహన్‌ వద్ద శింబు భరతనాట్యం నేర్చుకుంటున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

భరతనాట్యం నేర్చుకుంటున్న శింబు

హీరో శింబు భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ‘వేలాయుధం’ చిత్రంలో నటుడు విజయ్‌కి చెల్లెలుగా నటించిన శరణ్యా మోహన్‌ వద్ద శింబు భరతనాట్యం నేర్చుకుంటున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. శింబు ప్రస్తుతం సుశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఈశ్వరన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం శింబు 30 కేజీల బరువు కూడా తగ్గిన శింబు భరతనాట్యం నేర్చుకుంటున్నారు. శరణ్యా మోహనన్‌ వద్ద ఆయన భరతనాట్యం చేస్తున్న వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వచ్చాయి. శింబు సినిమాలో నటించడం కోసం భరతనాట్యం నేర్చుకోలేదని, స్వతహాగా నాట్యం నేర్చుకోవాలన్న తపనతోనే శరణ్య వద్ద శిక్షణ పొందుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.


Updated Date - 2020-11-04T21:58:22+05:30 IST

Read more