శింబుుకు ఖరీదైన బహుమతి!
ABN , First Publish Date - 2020-12-01T16:31:27+05:30 IST
లాక్‌డౌన్ సమయంలో తమిళ హీరో శింబు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు.

లాక్‌డౌన్ సమయంలో తమిళ హీరో శింబు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. కఠినమైన వర్కవుట్లు చేసి స్లిమ్‌గా, ఫిట్‌గా మారాడు. దానికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. శింబు నిబద్ధతకు, హార్డ్ వర్క్‌కు ఆయన తల్లి ఉషా రాజేందర్ మురిసిపోయారు.
శింబుకు ఖరీదైన బహుమతిని అందించారు. బ్రిటీష్ రేసింగ్ కారు మినీ కూపర్‌ను శింబుకు బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర దాదాపు రూ.50 లక్షలని తెలుస్తోంది. శింబు ఇటీవలె `ఈశ్వరన్` షూటింగ్‌ను పూర్తి చేశాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మానాడు` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
Read more