డిసెంబర్‌ నుండి 'శ్యామ్‌ సింగరాయ్‌'

ABN , First Publish Date - 2020-10-25T20:19:31+05:30 IST

డిసెంబర్‌ నుండి 'శ్యామ్‌ సింగరాయ్‌' రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా నటించబోతున్నారు.

డిసెంబర్‌ నుండి 'శ్యామ్‌ సింగరాయ్‌'

నేచురల్‌ స్టార్‌ నాని 'టక్‌ జగదీష్‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రంలో నాని నటించాల్సి ఉందనే సంగతి తెలిసిందే. అయితే విజయదశమి సందర్భంగా నాని తన తదుపరి చేయబోతున్న 'శ్యామ్‌ సింగరాయ్‌'కి సంబంధించిన ప్రకటనను వెలువరిచారు. డిసెంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా నటించబోతున్నారు. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు ఓ షాడో ఇమేజ్‌ను కూడా రిలీజ్‌ చేశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తుండగా సాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని హౌరా బ్రిడ్జ్‌, కాళీమాత ఫొటోలతో ఉన్న పోస్టర్‌ను  సింబాలిక్‌గా రివీల్‌ చేశారు. 


Updated Date - 2020-10-25T20:19:31+05:30 IST

Read more