నేనెప్పుడూ ఒంటరినే: శ్రుతి

ABN , First Publish Date - 2020-09-24T14:43:47+05:30 IST

లాక్‌డౌన్‌ రోజుల్లో షూటింగ్‌లు లేకుండా ఇంటిపట్టునే ఒంటరిగా గడుపుతున్నా తనకు బోర్‌కొట్టలేదని

నేనెప్పుడూ ఒంటరినే: శ్రుతి

లాక్‌డౌన్‌ రోజుల్లో ఇంటిపట్టునే ఒంటరిగా గడుపుతున్నా తనకు బోర్‌కొట్టలేదని, ఒంటరిగా ఉండడం తనకెంతో ఇష్టమని ప్రముఖ హీరోయిన్ శ్రుతీహాసన్‌ చెప్పింది. శ్రుతి నటించిన తమిళ చిత్రం `లాభం` త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒంటరిగా ఉండడం భయమని పలువురు చెబుతుంటారని, అయితే కొన్నేళ్లుగా తాను ఒంటరిగానే ఉంటున్నానని తెలిపింది. 


`చెన్నై ఎప్పుడు వచ్చినా డాడీ (కమల్‌హాసన్‌)ని కలుసుకుంటా.  ఆ తర్వాత ఒంటరిగానే ఉంటా. ఒంటరితం నాకెంతో ఇష్టం. వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం.. ఇలా అన్ని పనులు నేనే చేసుకుంటా. `సెలబ్రిటీలు వంటపాత్రలు కడుగుతారా?` అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. లాక్‌డౌన్‌ సమయంలో `వంటపాత్రలు కడిగే పోటీలో పాల్గొంటారా?` అని కొందరు సవాలు విసిరారు. వంటపాత్రలు కడగటం, ఇంటిని శుభ్రపరచడం.. ఒక సవాలా? ఆ పనులు అందరూ చేయాల్సినవేన`ని శ్రుతి పేర్కొంది. 

Updated Date - 2020-09-24T14:43:47+05:30 IST