‘పవర్‌స్టార్’: వర్మకు షాకిచ్చిన శ్రేయాస్‌ ఏటీటీ

ABN , First Publish Date - 2020-07-12T02:37:08+05:30 IST

వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఒకప్పటి సంచలన దర్శకుడు వర్మ.. ఇప్పుడు టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోని టార్గెట్ చేస్తూ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించడమే

‘పవర్‌స్టార్’: వర్మకు షాకిచ్చిన శ్రేయాస్‌ ఏటీటీ

వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఒకప్పటి సంచలన దర్శకుడు వర్మ.. ఇప్పుడు టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోని టార్గెట్ చేస్తూ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించడమే కాదు.. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌తో సోషల్ మీడియాని ఉక్కరిబిక్కిరి చేస్తున్నాడు. ‘పవర్‌స్టార్’ అనే టైటిల్‌తో వర్మ తీస్తున్న చిత్ర విషయమై కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ చిత్రం విషయంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వర్మకు తను నమ్ముకున్న శ్రేయాస్ ఏటీటీ సంస్థ షాక్ ఇచ్చినట్లుగా టాక్.


ఇప్పటి వరకు వర్మ ఈ లాక్‌డౌన్‌లో తన ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో క్లైమాక్స్, నేకెడ్ వంటి చిత్రాలను విడుదల చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ రెండు చిత్రాలకు సహకరించిన శ్రేయాస్ ఏటీటీ సంస్థ ‘పవర్‌స్టార్’ చిత్ర విషయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని శ్రేయాస్ ఏటీటీలో విడుదల చేయడం లేదని, ఈ చిత్రమే కాదు.. ఇకపై ఎటువంటి కాంట్రవర్సీ ఉన్న చిత్రమైనా సరే తమ ఏటీటీలో విడుదల చేయడం సాధ్యపడదని శ్రేయాస్ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారట. దీంతో వర్మకు షాకిచ్చిన ఏటీటీ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. మరి ఈ పరిస్థితుల్లో వర్మ తన ‘పవర్‌స్టార్’ను ఏ రూపంలో దించుతాడో..?

Updated Date - 2020-07-12T02:37:08+05:30 IST