స్వర సామ్రాజ్ఞికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ABN , First Publish Date - 2020-09-29T00:07:25+05:30 IST

స్వర సామ్రాజ్ఞి, భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్‌ 28). 1929లో జన్మించిన ఆమె ప్రస్తుతం 91వ పుట్టినరోజు

స్వర సామ్రాజ్ఞికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

స్వర సామ్రాజ్ఞి, భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్‌ 28). 1929లో జన్మించిన ఆమె ప్రస్తుతం 91వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలందరూ లతా మంగేష్కర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్స్ చేస్తున్నారు. హిందీ సినీ రంగంలో సింగర్‌గా ఆమె ఎన్నో తరాలను ఓలలాడిస్తూ వస్తున్నారు. ఎన్నో అవార్డులను ఆమె అందుకున్నారు. దాదాపు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక పురస్కారలన్నింటిని ఆమె అందుకున్నారు. సింగర్‌గానే కాక నిర్మాతగానూ ఆమె కొన్ని సినిమాలను నిర్మించారు. లతా మంగేష్కర్‌ను మా సరస్వతి అని అన్నారు మరో సింగర్‌ శ్రేయాఘోషల్‌.


'స్వర సామ్రాజ్ఞి, మా సరస్వతి అయిన లతా మంగేష్కర్‌ 91వ పుట్టినరోజు సందర్భంగా ఇవే నా ప్రణామాలు..' అని శ్రేయాఘోషల్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ఆమె మంచి ఆరోగ్యంతో కలకాలం అలరించాలని కోరుతూ.. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.Updated Date - 2020-09-29T00:07:25+05:30 IST