సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆయ‌న స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు: శోభన

ABN, First Publish Date - 2020-10-05T00:33:11+05:30

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు లేరనే విషయాన్ని ఇప్పటికీ సంగీత ప్రపంచం నమ్మలేకపోతుంది. ఆయన లేనప్పటికీ.. ఆయన పాట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు లేరనే విషయాన్ని ఇప్పటికీ సంగీత ప్రపంచం నమ్మలేకపోతుంది. ఆయన లేనప్పటికీ.. ఆయన పాట ఇప్పటికీ, ఎప్పటికీ వినబడుతూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పాటల రూపంలో వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా నటి శోభన తన ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా ఎస్‌.పి. బాలుని గుర్తు చేసుకుని.. ఆయన లేరంటే నమ్మలేకపోతున్నానని తెలిపారు. రజినీకాంత్‌తో కలిసి ఆమె నటించిన చిత్రంలోని బాలు, జానకి పాడిన పాటను ఆమె పోస్ట్ చేశారు. 


''బాలుగారి జ్ఞాపకార్థం నేను ఓ పాటని వెతుకుతున్నప్పుడు.. ఆయన లేరనే వార్త.. నన్ను ఎంతగానో బాధించింది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మేమిద్దరం కలిసి నటించాం కూడా. నేను దొంగగా, ఆయన పోలీస్‌గా ఓ చిత్రంలో నటించాం. చాలా సరదాగా ఉండేవారు. పాటలే ఆయన ప్రపంచం.. '' అని బాలుకి నివాళులు అర్పించారు నటి శోభన. 



Updated Date - 2020-10-05T00:33:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!