ఆయ‌న స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు: శోభన

ABN , First Publish Date - 2020-10-05T00:33:11+05:30 IST

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు లేరనే విషయాన్ని ఇప్పటికీ సంగీత ప్రపంచం నమ్మలేకపోతుంది. ఆయన లేనప్పటికీ.. ఆయన పాట

ఆయ‌న స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు: శోభన

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు లేరనే విషయాన్ని ఇప్పటికీ సంగీత ప్రపంచం నమ్మలేకపోతుంది. ఆయన లేనప్పటికీ.. ఆయన పాట ఇప్పటికీ, ఎప్పటికీ వినబడుతూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పాటల రూపంలో వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా నటి శోభన తన ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా ఎస్‌.పి. బాలుని గుర్తు చేసుకుని.. ఆయన లేరంటే నమ్మలేకపోతున్నానని తెలిపారు. రజినీకాంత్‌తో కలిసి ఆమె నటించిన చిత్రంలోని బాలు, జానకి పాడిన పాటను ఆమె పోస్ట్ చేశారు. 


''బాలుగారి జ్ఞాపకార్థం నేను ఓ పాటని వెతుకుతున్నప్పుడు.. ఆయన లేరనే వార్త.. నన్ను ఎంతగానో బాధించింది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మేమిద్దరం కలిసి నటించాం కూడా. నేను దొంగగా, ఆయన పోలీస్‌గా ఓ చిత్రంలో నటించాం. చాలా సరదాగా ఉండేవారు. పాటలే ఆయన ప్రపంచం.. '' అని బాలుకి నివాళులు అర్పించారు నటి శోభన. Updated Date - 2020-10-05T00:33:11+05:30 IST