శోభాడే ‘మెగా’ త‌ప్పిదం

ABN , First Publish Date - 2020-06-08T14:13:33+05:30 IST

ఉత్త‌రాదిన పేరు మోసిన కాల‌మిస్ట్‌, సామాజిక అంశాల‌పై చురుగ్గా స్పందించే వ్య‌క్తుల్లో శోభా డే ఒక‌రు. ఈమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన విష‌యంలో ఈమె చేసిన ఓ త‌ప్పు, స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టింది.

శోభాడే ‘మెగా’ త‌ప్పిదం

ఉత్త‌రాదిన పేరు మోసిన కాల‌మిస్ట్‌, సామాజిక అంశాల‌పై చురుగ్గా స్పందించే వ్య‌క్తుల్లో శోభా డే ఒక‌రు. ఈమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన విష‌యంలో ఈమె చేసిన ఓ త‌ప్పు, స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టింది. వివ‌రాల్లోకెళ్తే.. ఆదివారం ఉద‌యం క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి అనే పేరు చూసిన శోభాడే పూర్తి వివ‌రాలు తెలుసుకోకుండా మెగాస్టార్ చిరంజీవి ఫొటో పెట్టి సినీ ప‌రిశ్ర‌మ మ‌రో స్టార్‌ను కోల్పోయిందంటూ మెసేజ్ ట్వీట్ చేసింది. దీంతో మెగాభిమానులు శోభాడేపై సీరియ‌స్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో ఆమెపై విరుచుకుప‌డ్డారు. త‌న త‌ప్పును గుర్తించిన శోభా డే త‌న ట్వీట్‌ను తొలగించారు. ఇలాంటి సెన్సిటివ్ విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం లేదా? అంటూ అభిమానులు శోభా డేపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. 

Updated Date - 2020-06-08T14:13:33+05:30 IST