‘ఈశ్వరుడు’గా శింబు

ABN , First Publish Date - 2020-10-28T06:52:43+05:30 IST

తమిళ నటుడు శింబు హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘ఈశ్వరుడు’. నిధి అగర్వాల్‌ కథానాయిక. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం...

‘ఈశ్వరుడు’గా శింబు

తమిళ నటుడు శింబు హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘ఈశ్వరుడు’. నిధి అగర్వాల్‌ కథానాయిక. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.  విజయదశమి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో శింబు బాగా బరువు తగ్గి స్మార్ట్‌గా కనిపించారు. తనదైన స్టైల్‌లో లుంగీ కట్టుకొని, పడగవిప్పిన పామును మెడమీద వేసుకొని ఉన్న పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం తమన్‌. డీ కంపెనీ-కేవీ దురై బ్యానర్‌పై బాలాజీ కపా నిర్మిస్తున్నారు.  


Updated Date - 2020-10-28T06:52:43+05:30 IST