బన్నీ స్టెప్స్‌కి పాన్ ఇండియా క్రేజ్

ABN , First Publish Date - 2020-02-08T23:25:56+05:30 IST

‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అంటూ సాగే మెలోడీ

బన్నీ స్టెప్స్‌కి పాన్ ఇండియా క్రేజ్

‘అల వైకుంఠపురములో’ మూవీలోని  ‘బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆడియన్స్‌ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. సినిమా సక్సెస్‌లో కీ పాత్ర పోషించిన ఈ సాంగ్ టిక్ టాక్‌లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేశారు.


తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేసి పోస్ట్ చేశారంటే.. ఈ సాంగ్ ఏ రేంజ్‌లో వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ బన్నీ వేసిన స్టెప్స్ వేసి ఆమె అలరించారు. బుట్టబొమ్మ సాంగ్‌కి టిక్ టాక్‌లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఈ చిత్రం ‘బాహుబలి 2’ రికార్డులను కూడా బ్రేక్ చేయడం విశేషం.


బుట్టబొమ్మ పాటకి డ్యాన్స్ చేస్తున్న శిల్పాశెట్టి.. వీడియో కొరకు క్లిక్ చేయండి 

Updated Date - 2020-02-08T23:25:56+05:30 IST