నీ బ్రెస్ట్‌ను ముట్టుకోవచ్చా అని అడిగాడు: షెర్లిన్ చోప్రా

ABN , First Publish Date - 2020-09-24T20:23:23+05:30 IST

హీరోయిన్ షెర్లిన్ చోప్రా సోషల్ మీడియా ద్వారా క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ అధినేతపై సంచలన ఆరోపణలు చేసింది

నీ బ్రెస్ట్‌ను ముట్టుకోవచ్చా అని అడిగాడు: షెర్లిన్ చోప్రా

హీరోయిన్ షెర్లిన్ చోప్రా సోషల్ మీడియా ద్వారా క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ అధినేతపై సంచలన ఆరోపణలు చేసింది. క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ సహ భాగస్వామి అనిర్భన్ తన వక్షోజాల గురించి అసభ్యంగా మాట్లాడాడని తెలిపింది. 


`సినిమా అవకాశాల కోసం అనిర్భన్‌ను కలిశాను. అతను నన్ను పై నుంచి కింద వరకు చూశాడు. `ఏమైంది సర్.. నా డ్రెస్ బాగోలేదా` అని అడిగాను. `కాదు.. నీ వక్షోజాలు నిజమైనవేనా? వాటిని ముట్టుకోవచ్చా` అని అడిగాడు. నేను షాకయ్యాను. అవి నిజమైనవైనా, కాకపోయినా అతనికేంటి సమస్య? ఓ మహిళతో అలా మాట్లాడకూడద`ని షెర్లిన్ పేర్కొంది. 
Updated Date - 2020-09-24T20:23:23+05:30 IST