వెల‌క‌ట్ట‌లేని ఆనందం: శేఖ‌ర్ క‌మ్ముల‌

ABN , First Publish Date - 2020-05-13T19:51:02+05:30 IST

కరోనా వైర‌స్ నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్న వారిలో డాక్ట‌ర్స్‌, పోలీసులు, ఇత‌ర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ముందు వ‌రుస‌లో ఉన్నారు.

వెల‌క‌ట్ట‌లేని ఆనందం:  శేఖ‌ర్ క‌మ్ముల‌

కరోనా వైర‌స్ నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్న వారిలో డాక్ట‌ర్స్‌, పోలీసులు, ఇత‌ర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ముందు వ‌రుస‌లో ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ప్ర‌జ‌ల‌కు చేస్తున్న సేవ‌ల‌ను అభినందిస్తూ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల త‌న వంతు సాయంగా బాదంపాలు, మ‌జ్జిగ‌ను అందించే ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి గాంధీ హాస్పిట‌ల్‌లోని పారిశుద్ధ్య కార్మికులు శేఖ‌ర్ క‌మ్ములకు ప్ల‌కార్డుల‌తో థాంక్స్ చెప్పారు. దీనికి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన శేఖ‌ర్ క‌మ్ముల ‘‘గాంధీ హాస్పిటల్లోని పారిశుద్ధ్య కార్మికులు థాంక్స్ చెప్పిన తీరు వెలకట్టలేనిది. చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా పెద్ద అవార్డుగా భావిస్తున్నాను. నేను చేసిన చిన్న పని మీకు నచ్చింది. కానీ ప్రతిరోజూ మీరు చేస్తున్న పని ముందు నేను చేసేది చాలా చిన్నదే’’ అన్నారు. Updated Date - 2020-05-13T19:51:02+05:30 IST