`పోకిరి` గాళ్ అద్భుత విన్యాసం చూశారా?

ABN , First Publish Date - 2020-09-24T14:23:15+05:30 IST

సూపర్‌స్టార్ మహేష్ `పోకిరి` సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుంద శివ రాణా.

`పోకిరి` గాళ్ అద్భుత విన్యాసం చూశారా?

సూపర్‌స్టార్ మహేష్ `పోకిరి` సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుంది శీవ రాణా. ఆ సినిమాలో సెక్సీ గ్యాంగ్‌స్టర్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో అలాంటి పాత్రల్లోనే నటించింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. 


నాభి, ఉదరభాగాన్ని లోనికి లాగుతూ ప్రత్యేకమైన యోగా వీడియోను విడుదల చేసింది. `యోగా అనేది ఓ వెలుగు. జీవితం డిమ్ కాకుండా ఉండాలంటే ఆ లైట్ అవసరం. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే.. మీలో అగ్ని మరింత తేజోవంతం అవుతుంద`ని పేర్కొంది. శీవ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అద్భుతమైన ట్యాలెంట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
Updated Date - 2020-09-24T14:23:15+05:30 IST