శర్వానంద్‌ 'మహా సముద్రం' అధికారిక ప్రకటన

ABN , First Publish Date - 2020-09-07T17:55:19+05:30 IST

వెర్సటైల్‌ యాక్టర్‌ శర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'.

శర్వానంద్‌ 'మహా సముద్రం' అధికారిక ప్రకటన

వెర్సటైల్‌ యాక్టర్‌ శర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'. 'గమ్యం', 'ప్రస్థానం' వంటి చిత్రాల తర్వాత ఆ రేంజ్‌లో ఇంటెన్స్‌, స్ట్రాంగ్‌ ఉన్న పాత్రలో శర్వానంద్‌ మరోసారి మెప్పించనున్నారు. ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్‌గా 'మహా సముద్రం' ప్రేక్షకుల ముందుకు రానుంది.  'ఆర్‌.ఎక్స్‌ 100' వంటి సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత దర్శకుడు అజయ్‌ భూపతి డైరెక్ట్‌ చేస్తున్న చిత్రమిది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. 

 

ఇందులో శర్వానంద్‌తో పాటు మరో హీరోగా సిద్ధార్థ్‌ కనిపించబోతున్నారని సినీ వర్గాల సమాచారం. కానీ ఈ విషయమై చిత్ర యూనిట్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్‌. 


Updated Date - 2020-09-07T17:55:19+05:30 IST