శ్రీవారి సేవలో శర్వానంద్, రష్మిక
ABN , First Publish Date - 2020-10-25T16:37:23+05:30 IST
విజయదశమి సందర్భంగా యువ కథానాయకుడు శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

విజయదశమి సందర్భంగా యువ కథానాయకుడు శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కాంబినేషన్‌లో 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్, రష్మిక తిరుమల విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు దర్శకుడు కిషోర్ తిరుమల, చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా ఉన్నారు. అనంతరం చిత్రయూనిట్ ప్రేక్షకాభిమానులకు దసరా శుభాకాంక్షలను అందజేశారు.