శర్వా సముద్రం
ABN , First Publish Date - 2020-09-08T06:03:12+05:30 IST
శర్వానంద్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో సుంకర రామబ్రహ్మం నిర్మించనున్న చిత్రం ‘మహాసముద్రం’...

శర్వానంద్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో సుంకర రామబ్రహ్మం నిర్మించనున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్ భూపతి దర్శకుడు. ‘ఆర్‌ఎక్స్ 100’ విజయం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సోమవారం అధికారికంగా ప్రకటించారు. నిర్మాత సుంకర రామబ్రహ్మం మాట్లాడుతూ ‘‘నవరసభరితంగా ఉంటుందీ సినిమా. ఇదొక యాక్షన్ డ్రామాతో కూడిన గాఢమైన ప్రేమకథ. ‘ఆర్‌ఎక్స్ 100’తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన అజయ్ భూపతి, మరోసారి అబ్బురపరిచే కథ సిద్ధం చేశారు’’ అని అన్నారు.