3 నిముషాలు ఊపిరి బిగపెట్టి... అందరినీ అలరించి...
ABN , First Publish Date - 2020-03-03T14:10:58+05:30 IST
మూడు నిముషాల పాటు ఊపిరి బిగపెట్టి, తన అమోఘమైన గాత్రమాధుర్యంతో శ్రోతలను అలరించిన గాయకుడు శంకర్ మహదేవన్. ఈరోజు ఆయన పుట్టినరోజు. (మార్చి3). ఈ ఒక్క పాటతో...

మూడు నిముషాల పాటు ఊపిరి బిగపెట్టి, తన అమోఘమైన గాత్రమాధుర్యంతో శ్రోతలను అలరించిన గాయకుడు శంకర్ మహదేవన్. ఈరోజు ఆయన పుట్టినరోజు. (మార్చి3). ఈ ఒక్క పాటతో అతని స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. దీనితో పాటు పలు అద్భుతమైన పాటలు పాడిన శంకర్ మహదేవన్ నాలుగుసార్లు నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఈరోజు శంకర్ మహదేవన్ తన 53వ పుట్టిన రోజును చేసుకుంటున్నారు. మార్చి 3, 1967లో ముంబైలో ఉంటున్న ఒక తమిళ కుటుంబంలో శంకర్ మహదేవన్ జన్మించారు. ఐదేళ్ల వయసు నుంచే వీణ నేర్చుకోవడం ప్రారంభించారు. ప్రముఖ మరాఠీ సంగీత కళాకారుడు, పద్మభూషన్ పండిట్ శ్రీనివాస్ ఖలే దగ్గర శంకర్ మహదేవన్ శిష్యరికం చేశారు. చదువు పూర్తిచేసిన తరువాత ఆయన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరారు. అయితే తన కలలను పూర్తి చేసుకునే దిశగా ఆయన 1998లో తన తొలి ఆల్బం విడుదల చేశారు. దీనిలోని బ్రీత్ లెస్ సాంగ్ హిట్ కావడంతో శంకర్ మహదేవన్ తన కెరియర్‌లో ఇక వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం రాలేదు. సంగీతరంగంలో శంకర్ మహదేవన్ చేసిన సేవలకు గుర్తింపుగా 2019లో ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.