ర‌జినీ కోసం శంక‌ర్ శిష్యుడి క‌థ‌!

ABN , First Publish Date - 2020-06-15T17:52:12+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కోసం స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన సెల్వన్‌ కొత్త కథను సిద్ధం చేశారు.

ర‌జినీ కోసం శంక‌ర్ శిష్యుడి క‌థ‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కోసం స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన సెల్వన్‌ కొత్త కథను సిద్ధం చేశారు. సెల్వన్‌ ‘కృష్ణలీలై’, ‘సూరి’ అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. గత యేడాది సెల్వన్‌ భార్య సరళ మృతి చెందడంతో యేడాది కూడా నిండని తన కుమారుడిని అన్నీ తానై చూసుకుంటున్నారు. చెన్నైలో కరోనా వైరస్‌ వ్యాప్తిస్తుండడంతో సెల్వన్‌ తన కుమారుడితో విరుదాచలం సమీపంలోని కోపూవనూరుకు వెళ్లారు. లాక్‌డౌన్‌లో రెండు నెలలకు పైగా ఆ గ్రామంలో గడిపిన సెల్వన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు సరిపడేలా కథను రూపొందించినట్టు సెల్వన్‌ స్వయంగా ప్రకటించారు. త్వరలో రజనీని కలుసుకుని కథను వినిపిస్తానని, తన ప్రయత్నం సఫలమవుతుందని అనుకుంటున్నానని సెల్వన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-15T17:52:12+05:30 IST