నేనే ‘కార్పోరేటర్’ అంటోన్న స్టార్ కమెడియన్

ABN , First Publish Date - 2020-12-01T00:55:02+05:30 IST

తాజాగా హైదరాబాద్‌లో జరిగే జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లో కమెడియన్‌ ఎవరైనా పోటీ చేస్తున్నారా? గెలిచి కార్పోరేటర్ కావాలని అనుకుంటున్నాడా? అని

నేనే ‘కార్పోరేటర్’ అంటోన్న స్టార్ కమెడియన్

తాజాగా హైదరాబాద్‌లో జరిగే జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లో కమెడియన్‌ ఎవరైనా పోటీ చేస్తున్నారా? గెలిచి కార్పోరేటర్ కావాలని అనుకుంటున్నాడా? అని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు.. కాకపోతే స్టార్ కమెడియన్ కమ్‌ హీరో షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రానికి 'కార్పోరేటర్' అని టైటిల్‌ని ఖరారు చేశారు. మ్యాటర్‌ మొత్తం అర్థమై ఉంటుందిగా. సంజయ్ పూనూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా.. ఎ. పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి. మాధురి సహ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రానికి 'కార్పోరేటర్' టైటిల్‌ని ఖరారు చేసినట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. 


కార్పోరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్‌లో.. 5 పాటలు - 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ 'కార్పోరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు. ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా చిత్ర నిర్మాత ఎ. పద్మనాభరెడ్డి తెలిపారు. శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.Updated Date - 2020-12-01T00:55:02+05:30 IST

Read more