షారుఖ్‌ కొత్త చిత్రం ‘లవ్‌ హాస్టల్‌’

ABN , First Publish Date - 2020-10-30T03:32:02+05:30 IST

'లవ్‌ హాస్టర్‌' పేరుతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ సినిమా ఏమైనా చేస్తున్నాడా? అని అనుకుంటున్నారు కదా. నిజమే సినిమా చేస్తున్నాడు కానీ.

షారుఖ్‌ కొత్త చిత్రం ‘లవ్‌ హాస్టల్‌’

'లవ్‌ హాస్టర్‌' పేరుతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ సినిమా ఏమైనా చేస్తున్నాడా? అని అనుకుంటున్నారు కదా. నిజమే సినిమా చేస్తున్నాడు కానీ.. అతను నటిస్తున్న సినిమా కాదు.. నిర్మిస్తున్న చిత్రం. గత యేడాది 'కామ్యాబ్' చిత్రాన్ని నిర్మించిన షారుక్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్, దృశ్యం ఫిలిమ్స్ తాజాగా 'లవ్ హాస్టల్' పేరుతో  కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాయి. సన్యా మల్హోత్రా, విక్రాంత్ మాస్సే, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించే ఈ చిత్రానికి శంకర్ రామన్ దర్శకుడు.


సినిమాటోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకున్న శంకర్ రామన్ 'గోరేగావ్' చిత్రంతో దర్శకుడిగా మారాడు. గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం కూడా శంకర్‌ రామనే. 'లవ్ హాస్టల్' వచ్చే యేడాది షూటింగ్ ప్రారంభించుకుని, అదే సంవత్సరం జనం ముందుకూ తీసుకురావాలని చూస్తున్న ఈ చిత్రానికి గౌరీఖాన్‌, మనీష్‌ ముంద్ర, గౌరవ్‌ వర్మ నిర్మాతలు. Updated Date - 2020-10-30T03:32:02+05:30 IST