నవాజుద్దీన్ సోదరుడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మేనకోడలు

ABN , First Publish Date - 2020-06-04T00:44:24+05:30 IST

బాలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సోద‌రుడిపై ఢిల్లీలోని జామియా పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

నవాజుద్దీన్ సోదరుడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మేనకోడలు

బాలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సోద‌రుడిపై ఢిల్లీలోని జామియా పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. వివ‌రాల్లోకెళ్తే.. న‌వాజుద్దీన్ సోద‌రుడు త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని, ఆయ‌న మేన‌కోడలు కేసు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ‘‘కొన్నేళ్ల క్రితం నవాజుద్దీన్ మావయ్య సోదరుడు నాతో తప్పుగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని నవాజుద్దీన్ అంకుల్‌కు చెబితే నమ్మలేదు. ‘అతడు నీకు మావయ్య అలా ప్రవర్తించడు’ అన్నాడు’’ అని చెప్పారు. ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ రెండో భార్య ఆలియా ట్విట్టర్ ద్వారా స్పందించారు. నవాజుద్దీన్ కుటుంబం వల్ల  నేనొక్కదాన్నే కాదు.. చాలా మంది బాధలు పడ్డారు. మరెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి’’ అన్నారు. ఈ మధ్యనే నవాజుద్దీన్ నుండి ఆలియా విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2020-06-04T00:44:24+05:30 IST