సీనియర్‌ నిర్మాత కందేపి మృతి

ABN , First Publish Date - 2020-07-28T05:52:40+05:30 IST

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి బెంగళూరులో మృతి చెందారు...

సీనియర్‌ నిర్మాత కందేపి మృతి

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి బెంగళూరులో మృతి చెందారు.  ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 8.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 40 చిత్రాలు నిర్మించారు. డబ్బింగ్‌ చిత్రం ‘పాండురంగ మహత్యం’ నిర్మాతగా ఆయనకు తొలి సినిమా. ‘కొంగుముడి’, ‘శ్రీవారు’, ‘సక్కనోడు’, ‘మాయా మోహిని’ చిత్రాలకు ఆయనే నిర్మాత. కందేపి సత్యనారాయణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.


Updated Date - 2020-07-28T05:52:40+05:30 IST