గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి

ABN , First Publish Date - 2020-08-25T21:43:19+05:30 IST

ప్రముఖ సీనియర్ నటి శరణ్య ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ దర్శకుడైన భాస్కర్ రాజ్ (95).. ఆదివారం రాత్రి గుండెపోటుతో

గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి

ప్రముఖ సీనియర్ నటి శరణ్య ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ దర్శకుడైన భాస్కర్ రాజ్ (95).. ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన భాస్కర్ రాజ్.. శ్రీలంకలో దర్శకుడిగా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన తీసిని ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. 
ఆయన చిత్రాలకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఆయన సినిమాలు ఉండటం. భాస్కర్ రాజ్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. నివాళులు అర్పించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

Updated Date - 2020-08-25T21:43:19+05:30 IST