గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో శేఖర్ మాస్టర్
ABN, First Publish Date - 2020-08-24T18:49:40+05:30
పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అద్భుతమైన స్పంద వస్తుంది. సోమవారం రోజున ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాల్గొన్నారు.
పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అద్భుతమైన స్పంద వస్తుంది. పలువురు సినీ సెలబ్రిటీలు స్వచ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాల్గొన్నారు. ప్రదీప్ మాచిరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన శేఖర్ మాస్టర్ జూబ్లీ హిల్స్ పార్క్‌లో మొక్క నాటారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌గారికి శేఖర్ మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కొరియోగ్రాఫర్స్ బాబా భాస్కర్, సత్య మాస్టర్, రఘుమాస్టర్‌ను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శేఖర్ మాస్టర్ సూచించారు.