సుశాంత్.. నిన్ను ఇలా చేసిన వారి కథలు నాకు తెలుసు: శేఖర్ కపూర్

ABN , First Publish Date - 2020-06-16T16:54:33+05:30 IST

అర్ధంతరంగా తనువు చాలించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్

సుశాంత్.. నిన్ను ఇలా చేసిన వారి కథలు నాకు తెలుసు: శేఖర్ కపూర్

అర్ధంతరంగా తనువు చాలించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సుశాంత్‌ను ఇలా చేసిన వారి కథలు తనకు తెలుసంటూ శేఖర్ కపూర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. శేఖర్ కపూర్, సుశాంత్ కలిసి గతంలో `పానీ` సినిమా చేయాలనుకున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించాల్సింది. అయితే అన్నీ కుదిరిన తర్వాత యశ్‌రాజ్ సంస్థ ఎందుకో వెనక్కి తగ్గింది. దీంతో ఆ సినిమా ఆగిపోయింది. 


తాజాగా సుశాంత్ మరణం గురించి శేఖర్ వివాదాస్పద ట్వీట్ చేశారు. `సుశాంత్.. నువ్వు పడ్డ ఆవేదన నాకు తెలుసు. నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు తెలుసు. నువ్వు బాధపడుతూ నా భుజాలపై పడి కన్నీరు పెట్టుకున్నావు. గత ఆరు నెలలు నేను నీ దగ్గర ఉండుంటే బాగుండేది. నువ్వు నన్ను కలిసుంటే బాగుండేది. నీకు ఇలా జరగడం వాళ్ల కర్మ. నీది కాదు` అంటూ శేఖర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
Updated Date - 2020-06-16T16:54:33+05:30 IST